ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ఊరు- మన బడి పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-11-30T23:20:00+05:30

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, నవంబరు 30: మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో మనఊరు-మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ. జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 37 పాఠశాలల్లో ఎన్‌. ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టిన ప్రహరీలు, కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేసి పాఠశాలలకు కలరింగ్‌ పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలన్నారు. మిగిలి ఉన్న పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పరిపాలనాపరమైన అనుమతులు, గ్రౌండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకుక ఈఈలు, డీఈలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అన్నారు. డిసెంబర్‌ 15 నాటికి అన్ని హంగులతో పాఠశాలలను సుందరీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధ్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లారెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్‌డీవో కృష్ణన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్‌, టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising