ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షం.. పంటలకు తీవ్ర నష్టం

ABN, First Publish Date - 2022-10-18T04:35:37+05:30

పది రోజులుగా యాచారం మండలంలో కురుస్తున్న వర్షాలకు

యాచారం : కుర్మిద్దలో నీట మునిగిన వరిపంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, అక్టోబరు 17 : పది రోజులుగా యాచారం మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటలు పాడై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కుర్మిద్ద గ్రామంలో పంది చెన్నయ్య రూ.65 వేలు అప్పు చేసి మూడెకరాల్లో వరి పంట సాగుచేశాడు. తీరా కోతకు వచ్చే సమయంలో వానలు పడి పంటంతా నీటమునిగి నష్టం వాటిల్లింది. పంట కోసం చేసిన అప్పు  ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతమవుతున్నాడు. మంగలిగడ్డ తండాలో జగన్‌నాయక్‌ నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని టమాట తోట వేయగా వర్షాలకు మొత్తం పాడైంది. దీంతో అతనికి రూ. లక్షా 50వేల నష్టం వాటిల్లింది. నానక్‌నగర్‌, మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో వరి పంటతోపాటు పత్తి పంట కూడా నీట మునిగినట్లు ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచులు కోరుతున్నారు.


వర్షానికి కుంగిన పెద్దమాడ్గుల బ్రిడ్జి

మాడ్గుల : మండలపరిధిలోని పెద్దమాడ్గుల సమీ పంలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు కుంగిపోయింది. ఈ విష యాన్ని కల్లు ముత్యపురెడ్డి సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. స్పందించిన ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ రవీందర్‌కుమార్‌ సోమవారం కుంగిన బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.



Updated Date - 2022-10-18T04:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising