ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-05-27T04:59:11+05:30

రాష్ట్ర నిధుల కోసం, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి మోదీని

చీపునుంతలలో రైతు డిక్లరేషన్‌పై వివరిస్తూ కరపత్రాలను పంచుతున్న మల్లు రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే సీఎం ముఖం చాటేయడంలో అర్థం ఏమిటి?
  • ఏం ఉద్ధరించడానికి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి..
  • పీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి


ఆమనగల్లు, మే 26 : రాష్ట్ర నిధుల కోసం, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళితే అపాయింట్‌మెంట్‌ ఇస్తలేరని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. స్వయంగా మోదీనే రాష్ర్టానికి వస్తే ముఖం చాటేసి బెంగళూరు ఎందుకు వెళ్లినట్టు?.. అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ఆమనగల్లులో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రిని నిధులు, సమస్యలు వివరించడానికి అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదని, కేసీఆర్‌ విధానం ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. ఈ విషయంపై కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని రవి డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్‌ను ఎప్పుడైనా కలవొచ్చని.. కానీ అధికారిక కార్యక్రమానికి వచ్చిన పీఎంను ముఖ్యమంత్రి  కేసీఆర్‌ కలవకపోవడం రాష్ట్రానికి నష్టం చేకూర్చే అంశమని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ అహంకార ధోరణి వల్ల తెలంగాణ రాష్ర్టానికి తీరని నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో ఏం ఉద్ధరిస్తారని రవి మండిపడ్డారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌ విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని చెప్పారు.  అంతకుముందు రవి తలకొండపల్లి మండలం చీపునుంతలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్‌పై రైతులకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యమన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ సభ్యుడు ఐ.శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యానాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మండ్లీ రాములు, నర్సింహ, గుజ్జల మహేశ్‌, నాయకులు ఖలీల్‌, కృష్ణనాయక్‌, రాఘవేందర్‌, వస్పుల శ్రీశైలం, మోహన్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, అంజయ్యగుప్తా, చెన్నకేశవులు, అజీమ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-27T04:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising