రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మృతి
ABN, First Publish Date - 2022-10-08T05:00:48+05:30
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
షాద్‌నగర్ రూరల్, అక్టోబరు 7: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కన ఉన్న సందర్శిని రెస్టారెంట్ సమీపంలో మహబూబ్‌నగర్ వెళ్లేవైపు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రెస్టారెంట్ సమీపంలో ఓ మృతదేహం ఉండగా, మరికొంత దూరంలో మరో వ్యక్తి మృతదేహం పడి ఉంది. వాహనాలు అతడిపై వెళ్లడంతో కేవలం మోచేయి మినహా శరీరం మొత్తం రోడ్డుకు అతుక్కుపోయింది. మృతుల ఆచూకీ తెలిసిన వారు షాద్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
Updated Date - 2022-10-08T05:00:48+05:30 IST