ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు దొంగలకు జరిమానా, జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-12-15T23:50:14+05:30

చోరీ కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు దొంగలకు షాద్‌నగర్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి రాజ్యలక్ష్మి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 15: చోరీ కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు దొంగలకు షాద్‌నగర్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి రాజ్యలక్ష్మి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. 2020 మార్చి 18న పండిత్‌ సూరత్‌కుమార్‌ పాండే(23), షేక్‌ అప్రిద్‌(20) అనే వ్యక్తులు రాయికల్‌ గ్రామంలోని దారమోని స్వరూప దుకాణానికి వెళ్లి వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసినట్లు నటించి స్వరూప మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించారు. మరో దొంగతనం కేసులో ఇరువురిని జడ్చర్ల పోలీసులు 2020 జూన్‌ 10 అరెస్టు చేసి రిమాండ్‌ పంపినట్లు తెలిపారు. దాంతో పీటీ వారెంట్‌ జారీ చేయగా షాద్‌నగర్‌ కోర్టులో వాదనలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో 5ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. పుస్తెలతాడు అపహరించుకుపోయే క్రమంలో బైక్‌పై వెళ్తుండగా పడిపోయినట్లు చెప్పారని, అందువల్ల వస్తువు రికవరీ కాలేదని తెలిపారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 10 మందికి..

శంషాబాద్‌: శంషాబాద్‌ ఆర్జీఐఏ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది వాహనదారులకు రాజేంద్రనగర్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం జైలు శిక్ష విధించారని ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 32మందిపై చార్జిషీటు నమోదు చేసి కోర్టుకు సమర్పించగా వారిలో న్యాయమూర్తి 10మందికి 4రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని తెలిపారు. మిగిలిన 22 మందికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలు నివారించాలని సీఐ రామకృష్ణ కోరారు.

Updated Date - 2022-12-15T23:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising