బూర్గుల రామకృష్ణారావుకు నివాళులు
ABN, First Publish Date - 2022-09-15T05:36:36+05:30
బూర్గుల రామకృష్ణారావుకు నివాళులు
షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 14: షాద్‌నగర్ ప్రథమ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నివాళి అర్పించారు. బూర్గుల 55వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ ఆవరణలో రామకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నరుగా సేవలందించారని ఎమ్మె ల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామేశ్వరి, జడ్పీ వైస్ చైర్మ న్ గణేష్, ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్, జడ్పీటీసీలు పి.వెంకట్‌రాంరెడ్డి, విశాలశ్రవణ్‌రెడ్డి, బక్కన్న, గణేష్, నటరాజ్, లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీడీవో వినయ్‌కుమార్, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-15T05:36:36+05:30 IST