మర్రి చెన్నారెడ్డికి నివాళి
ABN, First Publish Date - 2022-12-03T00:38:53+05:30
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్ర మాన్ని శుక్రవారం నిర్వహించారు.
వికారాబాద్, డిసెంబరు 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్ర మాన్ని శుక్రవారం నిర్వహించారు. మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, బీజేపీ నాయకులు పట్టణంలోని చెన్నారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శివప్రసాద్, నవీన్, నరోత్తంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.
చెన్నారెడ్డి వర్ధంతిని మరిచిన సొంతూరు ప్రజలు
మర్పల్లి: మండలంలోని ప్రజాప్రతినిధులు మర్రి చెన్నారెడ్డి తమ మండల వాసి అని చెప్పుకోవడం తప్ప ఆయన జయంతి, వర్ధంతులు నిర్వహించడం లేదు. మర్రి చెన్నారెడ్డి మండలంలోని సిరిపురం గ్రామం నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి, పలు రాష్ట్రాల గవర్నర్‌గా పని చేశారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా సొంతూరు సిరిపురంలో ఉన్న ఆయన విగ్రహానికి నాయకులు గానీ, ప్రజాప్రతినిధులు పూలమాల వేయలేదు.
Updated Date - 2022-12-03T00:38:54+05:30 IST