ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
ABN, First Publish Date - 2022-10-18T05:29:19+05:30
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
శామీర్‌పేట, అక్టోబరు 17: ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని హకీంపేట డిపోమేనేజర్ భవభూతి అన్నారు. సోమవారం శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో ఆర్టీసీ క ళాబృందం ఆట, పాటలతో బస్సు సర్వీసులపై అవగాహన కల్పించింది. ప్రయాణీకులు ఆర్టీసీని ఆదరించాలని డీఎం కోరారు. ప్రజల సహకారంతో ఇప్పుడిప్పుడే కరోనా నష్టాల నుంచి సంస్థ కోలుకు ంటోందని అన్నారు. డిపో సహాయ మేనేజర్ రాజశేఖర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ జేఎ్‌సరెడ్డి, ఉపాధ్యాయులు తదితర నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:29:19+05:30 IST