ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2022-12-07T23:43:41+05:30
ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి కొత్తగా మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ విద్యుత్ అధికారులకు సూచించారు.
విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశం
వికారాబాద్, డిసెంబరు 7 : ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి కొత్తగా మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ విద్యుత్ అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని పాతూరు గ్రామంలో మీతోనేను కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామంలో కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామస్తులు తడి, పొడిచెత్త నిర్వహణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో ముందున్నారని, ఈ సందర్భంగా పాతూరు గ్రామ ప్రజలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.
ఉప సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ ఉపసర్పంచ్ సామల మహేందర్‌రెడ్డి తండ్రి కాంత్‌రెడ్డి మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనంద్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Updated Date - 2022-12-07T23:43:42+05:30 IST