ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్‌ లీజు

ABN, First Publish Date - 2022-05-27T04:58:13+05:30

ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్‌ లీజు

ఆర్డీవో విజయకుమారికి వినతి పత్రం ఇస్తున్న బండవెల్కిచర్ల ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి

కులకచర్ల, మే26: ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వ భూమిని మైనింగ్‌కు లీజుకు ఇస్తామని వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. బండవెల్కిచర్ల పరిధిలోని సర్వే నంబరు 415లో 56 హెక్టార్ల  ప్రభుత్వ భూమని రవిశీలంశెట్టి క్వార్డ్‌, ఫెల్డ్‌స్పార్‌కు మైనింగ్‌కు లీజుకు ఇవ్వడంపై గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి, మైనింగ్‌  ఈఈ పరమేశ్‌కుమార్‌  హాజరవగా, మైనింగ్‌తో వచ్చే దుమ్మువల్ల  సమీప రైతుల పొలాల్లో పంట దిగుబడి రాక నష్టపోవల్సి వస్తుందని ప్రజలు అధికారుల దృష్టికి  తెచ్చారు. గతంలో కూడా లీజుకు ఇవ్వడంతో గుట్టలను బ్లాస్టింగ్‌ చేయడం వల్ల వచ్చిన దుమ్ముతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారన్నారు.  పంటలు పండక రైతులు నష్టపోయారని, మైనింగ్‌కు లీజుకు ఇవ్వొద్దని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్టీవో విజయకుమారి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శిరీష, ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, పాలకవర్గ సభ్యులు పాల్గొనకపోవడం గమనార్హం, కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేశ్‌కుమార్‌, పరిగిసీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ గిరి, పాంబండ దేవాలయ చైర్మన్‌ రాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామస్థులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising