ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంచికొట్టిన వాన

ABN, First Publish Date - 2022-10-15T04:33:29+05:30

దంచికొట్టిన వాన

మద్గుల్‌ చిట్టంపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌/పెద్దేముల్‌, అక్టోబరు 14 : వికారాబాద్‌ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షం కురియగా, కొన్నిచోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురియగా, పెద్దేముల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, యాలాల్‌, తాండూరు, మోమిన్‌పేట్‌, ధారూరు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిఽధిలోని మద్గుల్‌ చిట్టంపల్లి వాగు ఉధృతంగా ప్రవహించింది. 

వంతెనపై నుండి పారిన గాజీపూర్‌ వాగు

 పెద్దేముల్‌ మండలంలో వాన దంచికొట్టింది. వాన దంచికొట్టడంతో మండలంలోని గాజీపూర్‌ వాగు వంతెనపైనుంచి పారింది. దీంతోపెద్దేముల్‌-తాండూరు మధ్యన గంటపాటు రాకపోకలు స్థంభించాయి. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. వాగుపైన వంతెన నిర్మించినా అది అసంపూర్తిగా వదిలేయడంతో ప్రతిసారి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

Updated Date - 2022-10-15T04:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising