ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ అభివృద్ధికి సహకరించాలి

ABN, First Publish Date - 2022-12-12T23:46:23+05:30

చారిత్రాత్మకమైన మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

శ్రీ రాజరాజేశ్వరాలయంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, డిసెంబరు 12: చారిత్రాత్మకమైన మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని శ్రీశివగంగ రాజరాజేశ్వరాయలంలో సోమవారం జరుగుతున్న అభివృద్ధి పనులను ఆలయ కమిటీ చైర్మన్‌ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రానున్న మహాశివరాత్రి ఉత్సవాల వరకు ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను పూర్తిచేసి భక్తులకు అంకితం చేయాలని పాలకవర్గాన్ని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన మంత్రి

తలకొండపల్లి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకును సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులు మంత్రి, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్‌, జడ్పీటీసీ వెంకటేశ్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌, బీజేపీ, ఎమ్మార్పీఎస్‌, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, డేవిడ్‌, ప్రభాకర్‌రెడ్డి, అజీం, జనార్ధన్‌రెడ్డి, రమేశ్‌, రవీందర్‌, బీజేపీ నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising