ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అరవింద్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN, First Publish Date - 2022-01-28T04:54:52+05:30

ఎంపీ అరవింద్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

తలకొండపల్లిలో ధర్నా చేస్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి పాండు ప్రసాద్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో 


తలకొండపల్లి/షాద్‌నగర్‌ అర్బన్‌/చేవెళ్ల/మొయినాబాద్‌/కేశంపేట/మహేశ్వరం/యాచారం/ఇబ్రహీంపట్నం, జనవరి 27: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి చేసిన దుండగులను శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు.  బీజేపీ జిల్లా కార్యదర్శి పాండు ప్రసాద్‌ బీజేపీ నాయకులతో కలిసి ఆమనగల్లు-షాద్‌నగర్‌ ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు రవిగౌడ్‌, హేమ రాజు, అనిల్‌, పోతుగంటి మహేశ్‌, యాదయ్య, శాంతకుమారి, పాండు, రవినాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మఠం రుషీకేష్‌ ఆధ్వర్యంలో గురువారం షాద్‌నగర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వంశీకృష్ణ, చెట్ల వెంకటేష్‌, అశోక్‌, హరీష్‌, మహేష్‌, శ్రవణ్‌, శ్యామ్‌సుందర్‌, శ్రీనివాసచారి పాల్గొన్నారు. చేవెళ్లలో పార్టీ మండల అధ్యక్షుడు డి.పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏ.అనంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్‌, కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోర నర్సింహారెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. కేశంపేట మండల బీజేపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహాయాదవ్‌ బీజేపీ నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాఘురాములగౌడ్‌, లింగయ్య, నరేందర్‌రెడ్డి, కృష్ణయాదవ్‌, విఠల్‌గౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మహేశ్వరంలో బీజేపీ మండల అధ్యక్షుడు మాధవాచారి, బీజేవైఎం జిల్లా అద్యక్షుడు టీ.యాదీష్‌, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాసానివెంకటే్‌షగౌడ్‌ తదితరులు నిరసన తెలిపారు. యాచారంలో పార్టీ మండల నాయకులు మారోగని శేఖర్‌, పి.శాంతికుమార్‌లు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జిల్లా ఇన్‌చార్జి బోసుపల్లి ప్రతాప్‌ బీజేపీ మండల అధ్యక్షుడు దండె శ్రీశైలం యాదవ్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి, నాయకులు ఎన్ను యాదగిరిరెడ్డి, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, శేఖర్‌రెడ్డి తదితరులు నిరసన తెలిపారు. 

Updated Date - 2022-01-28T04:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising