ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కంటి వెలుగు’లో లోపాలుండొద్దు : డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2022-12-16T00:03:34+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి లోపాలు ఉండవద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంఅండ్‌హెచ్‌వో) పుట్ల శ్రీనివాస్‌ తెలిపారు.

ఇన్‌పేషెంట్‌ వార్డును పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, డిసెంబరు 15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి లోపాలు ఉండవద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంఅండ్‌హెచ్‌వో) పుట్ల శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం శామీర్‌పేటలోని జిల్లా వ్యాక్సిన్‌, కంటి వెలుగు సెంటర్‌ స్టోర్‌ను తనిఖీ చేశారు. జిల్లాలో మొదటి విడత-2018 కంటివెలుగు ప్రోగ్రామ్‌-1 నాటి మిగులు సింగిల్‌ విజన్‌(మోనో విజన్‌), బై ఫోకల్స్‌ 1, 0, 1.25, 1, 75, 2.00 దృష్టి దిద్దుబాటు కోసం ఉపయోగించే కళ్ళద్దాల నాణ్యతను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు.

శామీర్‌పేట ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి సందర్శన

శామీర్‌పేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌ సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలోని ఇన్‌ పేషెంట్‌ వార్డులో ఉన్న రక్తహీనత గల గర్భిణీలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా డెంటల్‌ ఔట్‌ పేషెంట్‌ సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో కి వచ్చే ఔట్‌ పేషెంట్‌లకు ఉత్తమ వైద్యసేవలనందిస్తూ ప్రజల మన్నలను పొందాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.

Updated Date - 2022-12-16T00:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising