అన్నను హతమార్చిన తమ్ముడు
ABN, First Publish Date - 2022-12-16T23:21:24+05:30
కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన షాద్‌నగర్ శివారు సోలీపూర్ గ్రామ చర్లతండాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలే కారణం
షాద్‌నగర్ రూరల్, డిసెంబరు 16 : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన షాద్‌నగర్ శివారు సోలీపూర్ గ్రామ చర్లతండాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, తండావాసుల కథనం ప్రకారం.. చర్లతండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్ తన భార్యను సక్రమంగా చూసుకోకపోవడంతో అన్న రాము నాయక్(31) అప్పుడప్పుడు తమ్ముడిని మందలించేవాడు. దాంతో వారం రోజుల నుంచి అదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా లక్ష్మణ్ నాయక్ అర్ధరాత్రి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న రామూనాయక్ తలపై రాయితో కొట్టి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కాగా, మృతుడికి ఇంకా వివాహం కాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.
Updated Date - 2022-12-16T23:21:26+05:30 IST