ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2022-01-24T04:38:12+05:30

కులవృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి

కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీ రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, జనవరి 23: కులవృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక పథకాలను చేస్తోందని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు అన్నారు. మండల కేంద్రంలో ఎంపీ, ఏసీడీపీ నిధులతో రూ.20లక్షలతో చేపట్టే గౌడ, కురుమ, ముదిరాజ్‌, వడ్డెర సంఘాల సామూహిక భవనాల నిర్మాణానికి ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి ఎంపీ రాములు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా స్థానిక సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తుందని, మార్చి 7వ తేదీలోగా ఈ పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, ఆనంద్‌, జక్కు అనంతరెడ్డి, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, గంప వెంకటేశ్‌, గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, జహంగీర్‌బాబా, కడారి రామకృష్ణ, వేణుగోపాల్‌, ఎర్రోళ్ల రాఘవేందర్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-24T04:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising