ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడిన జింకను కాపాడిన గ్రామస్తులు

ABN, First Publish Date - 2022-12-15T00:32:21+05:30

ప్రమాదవశాత్తు బావిలో పడిన జింకను కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన బుధవారం శంకర్‌పల్లి మండలం అంతప్పగూడలో చోటుచేసుకుంది.

గ్రామస్తులు బావి నుంచి బయటకు తీసిన జింక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి, డిసెంబరు 14: ప్రమాదవశాత్తు బావిలో పడిన జింకను కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన బుధవారం శంకర్‌పల్లి మండలం అంతప్పగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య పొలంలోని బావిలో జింక పడిపోయింది. గమనించిన రైతు గ్రామస్తులతో కలిసి బావిలోకి దిగి జింకను కాపాడారు. చిలుకూరు అటవీ రేంజ్‌ అధికారి శ్రీకాంత్‌కు సమాచారమిచ్చారు. అధికారులు చేరుకొని జింకను పరిశీలించారు. జింక ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించుకొని జీపులో ఎక్కించుకొని అడవికి తరలించారు. కాగా శంకర్‌పల్లి మండలంలో అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చి తరచూ జింకలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. వారం క్రితం చందిప్పలో కుక్కల దాడిలో జింక మృతిచెందిన సంఘటన మరువక ముందే ఇప్పుడు మరో జింక బావిలో పడింది.

Updated Date - 2022-12-15T00:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising