ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-05T04:37:41+05:30

వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల

యంత్రంతో వరినాట్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డీఏవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, ఆగస్టు 4: వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు దాదాపు 3లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి తెలిపారు. ఆగస్టు చివరివరకు లక్ష్యాన్ని మించే అవకాశముందని ఆమె పేర్కొన్నారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామంలో రైతు ముదిరెడ్డి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన యంత్రం ద్వారా వరినాటు విధానాన్ని ప్రారంభించారు. అదేవిధంగా యంత్రం ద్వారా వరినాటు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల సమక్షంలో యంత్రం ద్వారా నాలుగు వరుసల వరి నాట్లు వేసి అవగాహన కల్పించారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. కూలీల కొరతను అదిగమించి, ,పంటల సాగు లో పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచుకునేందుకు యాంత్రికరణ పద్దతి ద్వారా వరి నాట్లపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వరి సాగులో విత్తనాలు చల్లే పద్దతి, డ్రమ్‌ సీడర్‌ ఉన్నాయని ప్రస్తుతం క్రీడా రూపొందించి యంత్రం ద్వారా వరి నాట్లు విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతేడాది 1.30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు 1.60 లక్షలు దాటే అవకాశం ఉందని గీతారెడ్డి వెల్లడించారు. రైతులందరు పీఎం కిసాన్‌ పథకం కోసం ఈ - కేవైసీ చేయించుకోవాలని ఆమె సూచించారు. గతంలో పీఎం కిసాన్‌ డబ్బులు పడ్డవారు ఈ - కేవైసీ చేయించుకోకపోతే వచ్చే విడత డబ్బులు పడే అవకాశం లేదని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ సుజాత , ఆమనగల్లు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, కేవికే ప్రధాన శాస్త్ర వేత్త బీవీ.రమణ, క్రీడా ప్రధాన శాస్త్ర వేత్త సంజీవ రెడ్డి, శాస్త్ర వేత్త విజయ్‌కుమార్‌, ఏవో అరుణకుమారి , ఏఈవో వాహిని,  చింతలపల్లి సర్పంచ్‌ కొప్పు మంజుల యాదయ్య, రైతు నాయకులు కమటం వెంకటయ్య, రూపం వెంకట్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, రామకృష్ణ, దావ అనంతం, రాములయ్య, పర్వతాలు, పెద్దయ్య , భగవాన్‌ రెడ్డి, శేఖర్‌రెడ్డి, నరేందర్‌ నాయక్‌, నాగయ్య, సాయిరెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-05T04:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising