‘కస్తూర్బా’ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
ABN, First Publish Date - 2022-10-17T05:30:00+05:30
‘కస్తూర్బా’ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
బంట్వారం అక్టోబరు 17: కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో పనిచేస్తున్న సి బ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రగతిశీల నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ అసోసియోషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీత డిమాండ్ చేశారు. సోమవారం బంట్వారంలో ఆమె నాన్‌టీచింగ్ వర్కర్స్ సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ 57వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సిబ్బంది బాలమణి, నీలమ్మ, ఈశ్వరమ్మ, పుణ్యమ్మ, వెంకటమ్మ, స్వప్న ఉన్నారు.
Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST