చెరువు మరమ్మతులు చేపట్టాలి
ABN, First Publish Date - 2022-10-18T05:28:10+05:30
చెరువు మరమ్మతులు చేపట్టాలి
చెరువును పరిశీలిస్తున్న అధికారులు
కేశంపేట, అక్టోబరు 17: కేశంపేట మండలం తూర్పు చౌలపల్లి గ్రామ శివారులోని ప్రమాదంగా మారిన పాత చెరువును ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాత చెరువు కరకట్ట దెబ్బతిన్న విషయం గ్రామ సర్పంచ్ గూడ వీరేష్ ఇరిగేషన్ అధికారుల దృష్టి తీసుకువెళ్లారు. కట్ట ప్రమాదంలో ఉన్నందున పరిశీలించి, మరమతులు చేయాలని కోరారు. సర్పంచ్ సూచన మేరకు సోమవారం ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. కరకట్టకు మరమతుల చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సర్పంచ్ గూడ వీరే్‌షను మరమతులు చేయించాలని సూచించారు. అధికారుల సూచనతో కరకట్ట మరమతుల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సత్యనారాయణ, శిరీష, భరతసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:28:10+05:30 IST