‘మన ఊరి చరిత్ర’ను సమగ్రంగా సేకరించాలి
ABN, First Publish Date - 2022-12-15T23:57:08+05:30
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరి చరిత్రపై సమగ్ర పరిశోధన చేయడం అవసరమని ‘మన ఊరు మన చరిత్ర’ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చింతల రాకేశ్ భవాని అన్నారు.
చేవెళ్ల, డిసెంబరు 15: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరి చరిత్రపై సమగ్ర పరిశోధన చేయడం అవసరమని ‘మన ఊరు మన చరిత్ర’ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చింతల రాకేశ్ భవాని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో తెలంగాణలో 12,679 గ్రామాల సమగ్ర చరిత్రను గ్రంథస్తం చేయడంలో భాగంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల కళాశాల కోఆర్డినేటర్ షేక్ మహబూబ్, ప్రిన్సిపాల్ జె.మల్లయ్య, వైస్ ప్రిన్సిపాల్ అనురాధ, అధ్యాపకులు వైష్ణవి, రూపనా, రవీందర్, జ్యోతి తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-12-15T23:57:09+05:30 IST