ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ముఖంలో ఆనందమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-12-07T22:43:20+05:30

తెలంగాణాలో ప్రతీ మహిళ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ వారి కోసం ఆనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

షీక్యాబ్‌ వాహనాలను అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారు ఆర్ధికంగా రాణించేందుకు అనేక సంక్షేమ పథకాల ఆమలు

షీ క్యాబ్‌ వాహనాల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణాలో ప్రతీ మహిళ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ వారి కోసం ఆనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యుల్‌ కులాల సేవా సహకార అభివృద్ది ఆధ్వర్యంలో షెడ్యుల్డ్‌ కులాలకు చెందిన 23 మంది మహిళలకు షీ క్యాబ్‌ వాహనాలను జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, ఆర్ధికాభివృద్దికి షీ క్యాబ్‌ వాహనాలను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో దళితబంధు కింద 563 యూనిట్లు అందజేసినట్లు గుర్తు చేశారు. మహిళలు సైతం అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణించాలన్నారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 23 మందికి వాహనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్‌లో పూర్తి శిక్షణ ఇచ్చి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా అందజేస్తామన్నారు. జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా రాణించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం బలహీనవర్గాల వారికి ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ బాలాజీ. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మదుకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising