టీఆర్‌ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
ABN, First Publish Date - 2022-08-04T05:45:23+05:30
టీఆర్‌ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
- వీఆర్‌ఏల సమ్మెలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
యాచారం/షాబాద్/కందుకూరు/మాడ్గుల/చేవెళ్ల/మంచాల, ఆగస్టు 3: రాష్ట్రంలో నిరుపేదలకు రక్షణ లేకుండా పోయిందని, పేదల బాధలను టీఆర్‌ఎస్ పాలకులు పట్టించుకోవడం లేదని, వారి పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ధ్వజమెత్తారు. సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు యాచారంలో బుధవారం మల్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపి రెవెన్యూ శాఖ పరువు మంట కలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్‌వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకువస్తామన్నారు. వీఆర్‌ఏల డిమాండ్లనూ తీరుస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కె.శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నర్సింహ, కె.గురునాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, యాదయ్య, అక్బర్, వి.తిరుమలేష్ పాల్గొన్నారు. అనంతరం యాచారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తల గోడు విన్నారు. షాబాద్ వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు పెంటయ్య ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించి వీఆర్‌ఏల పే-స్కేల్ అమలు చేయాలన్నారు. 55 సంవత్సరాల పైబడిన వీఆర్‌ఏల కుటుంబీకుల్లో ఒకరికి ఉ ద్యోగం ఇవ్వాలన్నారు. వీఆర్‌ఏలు రాములు, వెంకటయ్య, నిరంజన్, మల్లేష్, హరీష్, సుధాకర్, అలివేలు, శేఖర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. కందుకూరులో బుధవారం సంఘం మండల శాఖ అధ్యక్షుడు నర్సింహ ఆధ్వర్యంలో చేపట్టిన నమ్మెలో జిల్లా జేఏసీ చైర్మన్ వెంకటేష్ పాల్గొన్నారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. కాకి గణేష్, నరసింహ, టి.సుధాకర్, గణేష్, అంజయ్య, రమేష్, ఈశ్వరయ్య, జంగయ్య సత్యనారాయణ, పాండు, చంద్రయ్య పాల్గొన్నారు. మాడ్గులలో నిర్వహిస్తున్న వీఆర్‌ఏల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఊడ్చి నిరసన తెలిపారు. శివ, విజయ, లావణ్య, సుహాసిని, మణికుమార్ పాల్గొన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని జిల్లా జేఏసీ కో-కన్వీనర్ జగన్, చేవెళ్ల మండల అధ్యక్షుడు శంకర్ అన్నారు. చేవెళ్లలో వారు మాట్లాడారు. భాగ్య, అంజి, అంజయ్య, నర్సింలు, వెంకటయ్య, పుష్పరాజ్, సత్తయ్య, పెంటయ్య, సురేశ్ ఉన్నారు. మంచాలలో వీఆర్‌ఏలకు మద్దతుగా తహసీల్దార్ అనిత దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వీఆర్‌ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, పి.నాగరాజు, టి.మణికంఠ, ఎం.నాగరాజు, వై.భాస్కర్, నరేష్, చంద్రయ్య, వెంకటేశం, యాద య్య, సీహెచ్.శివకుమార్, శ్రీరాములు, పి.వెంకటేష్, ఉద్దగిరి వెంకటేష్, ఎం.నర్సింహ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:45:23+05:30 IST