ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్వాల మీదుగా బస్సు నడపాలని ఆందోళన

ABN, First Publish Date - 2022-12-16T23:18:22+05:30

కేశంపేట మండలం అల్వాల మీదుగా ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

బస్సును అడ్డుకొని ఆందోళన చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల రాస్తారోకో

కేశంపేట, డిసెంబరు16: కేశంపేట మండలం అల్వాల మీదుగా ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. షాద్‌నగర్‌ నుంచి కొత్తపేటకు వెళ్లే బస్సులు అల్వాల మీదుగా వెళ్లాలని డిమాండ్‌ చేస్తూ అల్వాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి బస్సులు రాకపోవడంతో కాలినడకన కొత్తపేట పాఠశాలకు దాదాపు 3కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, మార్గ మధ్యలో అకతాయిల వేధింపులతో విసిగి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల గ్రామం మీదుగా బస్సులు నడపాలని డిమాండ్‌ చేశారు. అలాగే డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామస్తుల సర్దిచెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్వాల గ్రామం మీదుగా బస్సులు నడపాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-16T23:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising