ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి

ABN, First Publish Date - 2022-02-06T05:53:08+05:30

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి

చీర్యాల్‌లో స్కూల్‌ను ప్రారంభిస్తున్న మహేష్‌భగవత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర, ఫిబ్రవరి, 5 : బాలకార్మిక వ్యవస్థ  రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. ఏయిడ్‌ ఏట్‌ యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో  చీర్యాల్‌, తిమ్మాయిపల్లి గ్రామాల్లో  ఏర్పాటు చేసిన వర్క్‌సైట్‌ స్కూళ్లను శనివారం ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశంతో 2017 సంవత్సవంలో ఏయిడ్‌ ఏట్‌ యాక్షన్‌ వారి సహకారంతో వర్క్‌సైట్‌ స్కూళ్లను ప్రారంభించడం జరిగిదంన్నారు. వర్క్‌సైట్‌ స్కూళ్లద్వారా కార్మికుల పిల్లలకు మరాఠి, ఒడిశా భాషాల్లో విద్య  బోధించడం జరుగుతుందన్నారు. పిల్లలకు చదువుతో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు.  ఇప్పటీ వరకు దాదాపు 3 వేల మంది పిల్లలు వారి  మాతృభాషల ద్వారా విద్య నేర్చుకోవడం జరిగిందన్నారు.  ఇక్కడ 5వ తరగతి వరకు చదువుకున్న పిల్లలకు వారి రాష్ర్టాలకు తిరిగి వెళ్లిన ఆనంతరం కూడా చదువు కొనసాగించే విధంగా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. సంస్థప్రతినిధులు, సీఐ రఘువీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-06T05:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising