ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధులను విస్మరించిన బీజేపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-10T05:10:34+05:30

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సమరయోధులకు బీజేపీ

కందుకూరులో చల్లా నర్సింహారెడ్డి, ఏనుగు జంగారెడ్డిలతో కలిసి మాట్లాడుతున్న పీసీసీ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

కందుకూరు ఆగస్టు 9 : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సమరయోధులకు బీజేపీ ప్రభుత్వ విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి, పీసీసీ కార్యదర్శి ఎల్మటి అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర 75 ఏళ్ల వజ్రోత్సవాలను పురస్కరించుకొని పీసీసీ ఆదేశానుసారం మంగళవారం పులిమామిడి నుంచి జైత్వారం, కొత్తగూడ గ్రామాల మీదుగా కందుకూరు వరకు చేపట్టిన ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్రలో వారు పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన లేదన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మతం పేరుతో మధ్య చిచ్చులు పెడుతూ కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలు విసిగి పోయారన్నారు. ఈనెల 15వరకు రంగారెడ్డి జిల్లాలో చేపట్టనున్న పాదయాత్రకు పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కందుకూరులోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎస్‌.కృష్ణానాయక్‌, జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, డిల్లీ శ్రీధర్‌, చిగిరింత నర్సింహారెడ్డి, వంగేటి ప్రభాకర్‌రెడ్డి, పెద్దబావి వెంకట్‌రెడ్డి, ఎండి అబ్జల్‌బేగ్‌, బొక్క భూపాల్‌రెడ్డి, బంగారుబాబు, బుక్క ప్రశాంతిరెడ్డి, సరికొండ మల్లేష్‌, కె.వెంకటేష్‌, టి.వినోద్‌చారి, బాలునాయక్‌, జైహిందు, సిద్దాల శ్రీశైలం, ఎస్‌.రాంరెడ్డి, ప్రశాంత్‌కుమార్‌, జి.సుధాకర్‌రెడ్డి, మహేందర్‌, సరికొండ జగన్‌, సౌడపు వెంకటే్‌షగౌడ్‌, రియాజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-10T05:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising