ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దతు ధర కల్పించడమే ధ్యేయం

ABN, First Publish Date - 2022-05-20T05:40:26+05:30

రైతులకు మద్దతు ధర కల్పించడమే ధ్యేయం

తలకొండపల్లి: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి/ఇబ్రహీంపట్నం రూరల్‌, మే 19: రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మార్కెట్‌చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎ్‌స్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీను, చందూనాయక్‌, రాజేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, సంతోష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్‌లో సర్పంచ్‌ గంగిరెడ్డి బల్వంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రాయపోల్‌ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో ఇంగ్లీష్‌ టు తెలుగు డిక్షనరీలు పంపిణీ చేశారు. విద్యార్థులు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్‌చైర్మన్‌ ఈశ్వర్‌, ఉపసర్పంచ్‌ బాల్‌రాజ్‌, ఎంపీటీసీ శ్రీశైలం, గంగిరెడ్డి జ్యోతిభాస్కర్‌రెడ్డి, సహకారసంఘం డైరెక్టర్లు దొండ యాదిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వార్డుసభ్యులు బాలుగౌడ్‌ పాల్గొన్నారు. 

ఆధునిక సాగువిధానాలు అవలంభించాలి

మంచాల/తలకొండపల్లి, మే 19: రైతులు ఆధునిక సాగువిధానాలు అవలంభించాలని ఎంపీపీ జాటోత్‌ నర్మద, జిల్లా ఉద్యానవనశాఖ, పట్టుపరిశ్రమశాఖ అధికారి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సునందరాణి అన్నదాతలకు సూచించారు. మంచాలలోని రైతువేదిక భవనంలో గురువారం కూరగాయల పంటలసాగు సస్యరక్షణ చర్యలకు సంబంధించి వానాకాలంలో వేసే పంటలపై రైతుశిక్షణ ఏర్పాటుచేశారు. ఉద్యానవనశాఖ జిల్లా అధికారి కనకలక్ష్మి ఆధ్వర్యంలో ఏడీఏ సత్యనారాయణ, ఏవో స్వాతి, ఏఈవోలు లింగం, సరిత,  రైతుబంధుసమితి జిల్లా సభ్యుడు పల్లె జంగారెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ జెనిగె వెంకటేష్‌, ఎంపీటీసీ పి.సుకన్య, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం షాద్‌నగర్‌ వ్యవసాయశాఖ ఏడీఏ రాజరత్నం వానాకాలం పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో సర్పంచులు లలితజ్యోతయ్య, రమేశ్‌, ఎంపీటీసీ రమేశ్‌, ఏఈవోలు విజయ్‌, శ్రీనాథ్‌, శిరీష, శ్రీవాణి, శ్రీకాంత్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-20T05:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising