బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)ను గద్దె దింపడమే లక్ష్యం
ABN, First Publish Date - 2022-10-08T05:14:38+05:30
బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)ను గద్దె దింపడమే లక్ష్యం
- బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతికిరణ్
పూడూర్, అక్టోబరు 7: ప్రజావ్యతిరేక విధానాలతో కుటుంబ పాలన కొనసాగిస్తున్న బీఆర్‌ఎ్‌స(టీఆర్‌ఎ్‌స)ను గద్దె దింపడమే లక్ష్యమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతికిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ ఉప సర్పంచ్, బీజేపీ పూడూర్ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని మారుతికిరణ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్, పూడూర్ మండలాధ్యక్షుడు జాజుల అనిల్, నాయకులు రాముయాదవ్, రాజు, పరమానందదాస్, రాజేశ్‌గౌడ్, ప్రసాద్‌గౌడ్, మాణిక్య, శివ, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T05:14:38+05:30 IST