ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

ABN, First Publish Date - 2022-11-30T23:34:05+05:30

అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, నవంబరు 30 : అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గొల్లూరులో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కావాల్సిన నిధులు విడుదల చేశారన్నారు. అదేవిధంగా ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 9వేల పాఠశాలలకు మొదటి విడత రూ. 3500 కోట్లు విడుదలయ్యాయన్నారు. అంతేకాకుండా జిల్లాలో 464 పాఠశాలలకు రూ.200కోట్ల నిధులను వెచ్చించామన్నారు. మహేశ్వరం నియోజకరవ్గంలోని పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. అనంతరం పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునిత, సర్పంచ్‌ మంద కవిత, ఎంపీటీసీ, పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పండుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంగోత్‌ రాజునాయక్‌, చంద్రయ్య, అంబయ్య, నవీన్‌, రాములునాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising