ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సంస్కృతి గొప్పది: ఆర్పీసింగ్‌

ABN, First Publish Date - 2022-09-28T05:03:46+05:30

తెలంగాణ సంస్కృతి గొప్పది: ఆర్పీసింగ్‌

బతుకమ్మ సంబురాల్లో ఆర్పీసింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు, సెప్టెంబరు 27: దేశంలో తెలంగాణ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీసింగ్‌ అన్నారు. షాద్‌నగర్‌ వివేకనందా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆర్పీసింగ్‌ పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జీ ఎన్‌ శ్రీవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్‌, సహాయ కార్యదర్శి కమ్మరి భూపాలచారి, కళాశాల డైరెక్టర్‌ గంట సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్‌ హర్షద్‌ వేడుకలను ప్రారంభించారు. జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, ఎంపీపీ అనితవిజయ్‌, ఎంపీటీసీలు కుమార్‌, సరితపంతూనాయక్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తిరుపతిరెడ్డి, లక్ష్మీ, నాగేశ్వరి, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising