ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న పద్ధతుల్లో బోధన చేపట్టాలి

ABN, First Publish Date - 2022-12-31T00:09:47+05:30

ఉపాధ్యాయులు వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తూ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దాలని ఎంఈవో వసంతకుమారి అన్నారు.

శామీర్‌పేట : జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ను పరిశీలిస్తున్న ఎంఈవో వసంతకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయులకు ఎంఈవో వసంతకుమారి సూచన

శామీర్‌పేట/పెద్దేముల్‌/ధారూరు/ఘట్‌కేసర్‌ రూరల్‌/కులకచర్ల/పరిగి, డిసెంబరు 30 : ఉపాధ్యాయులు వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తూ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దాలని ఎంఈవో వసంతకుమారి అన్నారు. శుక్రవారం శామీర్‌పేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నిర్మలాబాయి ఆధ్వర్యంలో, అలియాబాద్‌ జడ్పీ ఉన్నత పాఠశాల్లో హెచ్‌ఎం నర్సింగరావు ఆధ్వర్యంలో రెండో రోజు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు నూతన విద్యాబోధన పట్ల తయారు చేసిన టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ను ప్రదర్శించారు. ఈ టీచింగ్‌ మెటీరియల్‌ను ఎంఈఓ వసంతకుమారి, మండల నోడల్‌ ఆఫీసర్‌ గులాంముర్తుజా క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా సూచించారు. పిల్లల్లో బోధనాసక్తిని పెంచేవిధంగా బోధనోపకరణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ఎంపీపీ అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్‌ అన్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో మండలస్థాయిలో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. 31 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు 132 బోదన ఉపకరణాలను తయారు చేసి వాటి గురించి వివరించారు. సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మధులత, ఎంఈవో వెంకటయ్య, టీఎల్‌ఎం మండల నోడల్‌ అధికారి దూస రాములు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తరగతులకు తగ్గట్టుగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. ధారూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్‌- టీఎల్‌ఎం మేళాలో ఆమె పాల్గొని భోదనోపకరణాలను పరిశీలించారు. జడ్పీటీసీ సుజాత ఉదయం టీఎల్‌ఎం మేళాను ప్రారంభించి పరిశీలించారు. సర్పంచ్‌ చంద్రమౌళి, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ వై.సత్యనారాయణ రెడ్డి, ఎంఈవో బాబుసింగ్‌, ప్రధానోపాద్యాయులు దేవ్యా, రవీందర్‌రెడ్డి, రాంచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యార్థులకు అర్థమయ్యేలా టీచర్లు బోధించాలని ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల సర్పంచ్‌ వెంకటే్‌షగౌడ్‌ తెలిపారు. కొర్రెముల, ఎదులాబాద్‌ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఎదులాబాద్‌ సర్పంచ్‌ సురేష్‌, ఎంపీటీసీ వినోద, నోడల్‌ అధికారి సరస్వతి, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర తెలిపారు. కులకచర్ల బాలుర ఉన్నత పాఠశాలలో తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి బోధనోపకరణాల ప్రదర్శన నిర్వహించారు. ఎంఈవో అబీబ్‌హమ్మద్‌, సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఎంపీటీసీ ఆనందం, హెచ్‌ఎంలు రవీందర్‌గౌడ్‌, వెంకటయ్య, రాములు, దేవి, డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిగిలోని జడ్పీహెచ్‌ఎ్‌సనె.ం01 పాఠశాలలో మండల స్థాయి టీఎల్‌ఎం మేళాను మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌ ప్రారంభించారు. 52 పాఠశాలల నుంచి వచ్చిన టీచర్లు బోధనోపకరణాలను ప్రదర్శించారు. టీఎల్‌ఎంలో ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌, ఎంఈవో హరిశ్చందర్‌లు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి మేళాలు దోహదపడతాయన్నారు. ఎంపీపీ అరవింద్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising