ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-05-18T05:30:00+05:30

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

మేడ్చల్‌ : కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న యూఎ్‌సపీసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మేడ్చల్‌ అర్బన్‌/వికారాబాద్‌, మే 19 : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ సంపాదకులు పి. మాణిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎ్‌సపీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ జీవో 317తో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యాశాఖ మంత్రి హామీ మేరకు.. వేసవి సెలవులు ముగిసేలోపు నోటిఫికేషన్‌ విడుదల చేసి పదోన్నతులు చేపట్టి బదిలీలు పూర్తి చేయాలన్నారు. విద్యాశాఖలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు జయసింహారెడ్డి, రాకేష్‌, బ్రహ్మచారి, నీరజ, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ను విద్యాశాఖ తక్షణమే విడుదల చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు బందెప్ప డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట యూఎస్‌పీసీ, టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని, సీఎం పలుమార్లు పదోన్నతులు ఇస్తామని ప్రకటించారన్నారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇవ్వటానికి ఆటంకాలు ఏమీ లేవని విద్యాశాఖ మంత్రి పలుమార్లు స్పష్టం చేశారని, షెడ్యూల్డ్‌ విడుదల చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవో 317పై ఉన్న అప్పీళ్లు, భార్యభర్తల బదిలీలు, పరసర్ప బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏటూ తేల్చకుండా తాత్సారం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లా నాయకులు రాములు, మోయిజ్‌ ఖాన్‌, అజయ్‌, వెంకటయ్య, బుచ్చయ్య, లక్ష్మణ్‌, సాదత్‌  అలీ, రాములు, ప్రభాకర్‌, మేఘ, బసప్ప, పరమేశ్‌, రాములు వినోద్‌, లక్ష్మణ్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising