ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2022-07-03T05:55:42+05:30

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ఫరూఖ్‌నగర్‌ ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ అర్బన్‌/మాడ్గుల/శంషాబాద్‌, జూలై 2: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాఽధ్యాయ పోస్టులతో పాటు ఎంఈవోలను వెంటనే భర్తీచేయాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివ, షాద్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ సభ్యులు బిలాల్‌, సాయి, శివ, నవీన్‌, మోసిన్‌, అన్వర్‌, ఉమర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలంలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని  ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు మాస్కు చరణ్‌ ఎంఈవో రామాంజన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, యూనీఫాంలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కలకొండ ఉన్నత పాఠశాలలో 70మంది విద్యార్థినులు ఉన్నా మరుగుదొడ్డి లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శంషాబాద్‌లో ఎస్‌ఎ్‌ఫఐ కార్యకర్తలు భరత్‌, ప్రసాద్‌, రాజాలు ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 

Updated Date - 2022-07-03T05:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising