ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నులు సకాలంలో చెల్లించాలి

ABN, First Publish Date - 2022-12-07T23:44:26+05:30

పన్నులు సకాలంలో చెల్లించాలని, లేనియెడల మొండి బకాయి దారులకు రెడ్‌ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ సురేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, డిసెంబరు 7 : పన్నులు సకాలంలో చెల్లించాలని, లేనియెడల మొండి బకాయి దారులకు రెడ్‌ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ సురేష్‌ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్యాపార సంస్థల నిర్వాహకులకు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. నారపల్లిలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు యాజమాన్యం రెండు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. అదేవిధంగా కనీసం ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బంకును సీజ్‌ చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో రూ.2.9లక్షలు బంక్‌ యాజమాన్యం చెల్లించినట్లు తెలిపారు. అలాగే రావీస్‌ పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడంతో 3.74లక్షలు చెల్లించినట్లు వివరించారు. మున్సిపాలిలిటీ పరిధిలో పన్నులు చెల్లించకుండా మొండిగా వ్యవరిస్తున్న వ్యాపార సంస్థలకు రెడ్‌ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మేనేజర్‌ నర్సింహులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising