శబరిమలపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలి
ABN, First Publish Date - 2022-12-15T00:34:49+05:30
రళలోని శబరిమలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్.రంగరాజన్ అన్నారు.
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 14: కేరళలోని శబరిమలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్.రంగరాజన్ అన్నారు. ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించాలి.. ఎందుకు అనుమతించొద్దు అనే అంశంపై 2018లోనే మైత్రీ స్పీక్స్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకురాలు సిను జోసెఫ్ రాసిన ‘మహిళలు-శబరిమల శాస్త్రీయ వివరణ’ అనే పుస్తకంలో వివరించారన్నారు. ఈ పుస్త
కాన్ని ట్రస్ట్‌కు చెందిన హేమలత బుధవారం రంగరాజన్‌కు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్లుగా పరిశోధనలు చేసి జోసెఫ్ ఈ పుస్తకాన్ని రాశారని అన్నారు. మహిళలు, బాలికలతో సమావేశాలు నిర్వహించి వివరాలను పొందుపర్చారని తెలిపారు. షట్చక్ర ఆలయాలు అని పిలవబడే ఆరు ఆలయాల్లో శబరిమల అంతర్భాగం అని అరవింద్ సుబ్రహ్మణ్యం అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధనలో తేలిందని రంగరాజన్ తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సంప్రదాయాన్ని, మతపర మనోభావాలను సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతీసిందన్నారు. కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా పురుషులు, మహిళలు ఎందుకు నిరసనించారు తదితర అంశాలు పుస్తకంలో క్లుప్తంగా ఉన్నాయని రంగరాజన్ అన్నారు. రాజ్యంగం, నైతికత అనే పదాలు తమకు అవసరం లేదన్నారు. అలాగే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు కూడా తమకు అవసరం లేదని రంగరాజన్ తేల్చిచెప్పారు.
Updated Date - 2022-12-15T00:34:51+05:30 IST