ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరువ్యాపారులను ఆదుకోండి

ABN, First Publish Date - 2022-06-29T06:11:47+05:30

చిరువ్యాపారులను ఆదుకోండి

పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కలిసిన ఎమ్మెల్యే 


ఆమనగల్లు, జూన్‌ 28: మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట దుకాణ సముదాయం నిర్మించి చిరువ్యాపారులను ఆదుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియాను కోరారు. ఈమేరకు  మంగళవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కలిసి సందీ్‌పకుమార్‌ సుల్తానీయకు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్‌-శ్రీశైలం, ఆమనగల్లు-షాద్‌నగర్‌ రహదారుల విస్తరణ మూలంగా దుకాణాలు, కొట్లు, డబ్బాలు తొలగించడంతో సుమారు 350మంది చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారని, దుకాణ సముదాయాలు నిర్మించి వారిని ఆదుకోవాలని వినతిపత్రంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు  సుల్తానియా కోర్టులో చిరువ్యాపారులు వేసిన కేసును ఉపసంహరించుకోవాలని, ఉపాధి కోల్పోయిన చిరువ్యాపారులతో సమావేశం నిర్వహించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌ తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-06-29T06:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising