ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా

ABN, First Publish Date - 2022-10-02T05:30:00+05:30

నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా

టేకులపల్లిలో విద్యార్థి మహేశ్‌కు ఆర్థికసాయం విష్ణువర్ధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోమిన్‌పేట్‌, అక్టోబరు 2: నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి అండగా ఉంటానని మోమిన్‌పేట్‌ మండల సొసైటీ చైర్మన్‌ బండ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామసభ నిర్వహించి పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. టేకులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మహేశ్‌ బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ తీసుకునేందుకు గాను డబ్బులు అవసరం ఉండటంతో తన వంతు సాయంగా చైర్మన్‌ రూ.15వేలు అందించారు. గ్రామంలోని విద్యార్థులు బాగా చదువుతూ గ్రామానికి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం గాంధీ జయంతి సందర్బంగా మోమిన్‌పేట్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, అంజయ్య, నర్సిములు, గోపాల్‌రెడ్డి, జాఫర్‌, వీరేశం, సుదర్శన్‌, ఉప సర్పంచ్‌ రైస్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, వార్డు సభ్యులు పాష, రాజు, రాములు, సరిత, వీరమణి, వెంకటేశం, మనెయ్య, సుజాత, సర్పంచ్‌ అంగేరి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి నర్సిములు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising