ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-08-04T05:53:56+05:30

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : కలెక్టర్‌

విద్యార్థులతో కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, ఆగస్టు 3 : విద్యార్థులు విద్యతో పాటు మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని దేశానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల విద్యార్థులకు సూచించారు. బుధవారం మునిసిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లిలో గల హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిట్యూర్‌ వేడుకల్లో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి నాయకులుగా ఎన్నికైనవారు తోటి విద్యార్థులకు రోల్‌మోడల్‌గా నిలువాలని సూచించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని, సమస్యలపై స్పందిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ హెడ్‌ బాయ్‌, హెడ్‌ గర్ల్‌ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులను కలెక్టర్‌ అభినందించింది బ్యాడ్జీలను అందజేశారు. పాఠశాల చైర్మన్‌ మన్సూర్‌ బాబాఖాన్‌, డైరెక్టర్‌ అలీముద్దీన్‌ హైదర్‌, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising