ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

ABN, First Publish Date - 2022-05-27T05:02:59+05:30

కళాశాలల విద్యార్థులు చదువుతో పాటు

క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న ఇందుజారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇండియన్‌ త్రోబాల్‌ టీం కెప్టెన్‌ ఇందుజారెడ్డి 

మొయినాబాద్‌ రూరల్‌, మే 26 : కళాశాలల విద్యార్థులు చదువుతో పాటు జాతీయ స్థాయి క్రీడల్లోనూ రాణించేలా కృషి చేయాలని, యజమాన్యాలు కూడా ప్రోత్సహించాలని ఇండియన్‌ త్రోబాల్‌ టీం కెప్టెన్‌ ఇందుజారెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండలం ఆమ్డాపూర్‌లోని జేబీఐఈటీలో 2022ఫెస్ట్‌ సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను గురువారం ఇందుజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణిస్తేనే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే క్రీడారంగంలోనూ వివిధ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సహంగా పాల్గొనడం సంతోషకరం అన్నారు. విద్యా సంస్థల యజమాన్యాలూ క్రీడల కోసం తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణమాచారి, పీఈటీ విఘ్నేష్‌, విద్యార్థి సంఘం నాయకుడు రాఖేష్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-27T05:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising