ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటకెక్కిన ఆమోదం!

ABN, First Publish Date - 2022-10-18T04:37:12+05:30

తాండూరు మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం లభించడం లేదు. దీంతో వివిధ కారణాలచేత ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ సుమారు రూ.20కోట్ల వరకు మున్సిపాలిటీలోనే మురుగుతున్నాయి.

తాండూరు మున్సిపల్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  తాండూరు మున్సిపాలిటీలోనే మురుగుతున్న రూ.20కోట్లు
  •  ఆమోదం లేని తాండూరు బల్దియా బడ్జెట్‌ 
  • సమస్యను పరిష్కరించని మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి
  •  కార్మికుల వేతనాల చెల్లింపులకే పరిమితం
  •  మూలన పడిన శానిటేషన్‌ ట్రాక్టర్లు, ఆటోలు

తాండూరు మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం లభించడం లేదు.  దీంతో వివిధ కారణాలచేత ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ సుమారు రూ.20కోట్ల వరకు మున్సిపాలిటీలోనే మురుగుతున్నాయి. బడ్జెట్‌కు సంబంధించి హైకోర్టులో కేసు వేయడంతో నిధుల వ్యవయానికి బ్రేక్‌ పడింది.

తాండూరు, అక్టోబరు, 17 : తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి రూ.60కోట్ల అంచనాలతో ఏర్పాటు చేసిన బడ్జెట్‌కు ఆమోదం లభించడం లేదు.  వివిధ కారణాలచేత ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ సుమారు రూ.20కోట్ల వరకు మున్సిపాలిటీలోనే మురుగుతున్నాయి. ఈ నిధులను వ్యయం చేయలేని పరిస్థితి తాండూరు మునిసిపాలిటీలో నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించి హైకోర్టులో కేసు వేయడంతో నిధుల వ్యవయానికి బ్రేక్‌ పడింది. మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశాన్ని ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించారు. బడ్జెట్‌ సమావేశంలో తప్పనిసరి కలెక్టర్‌ లేదా కలెక్టర్‌ పంపించే ప్రతినిధి ఎవరైనా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఆరోజు బడ్జెట్‌ సమావేశానికి అదనపు కలెక్టర్‌ను పంపించారు. మొదట సమావేశఽం జరుగగా, కోరం లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ ప్రకటించి వెళ్లిపోయారు. గంట తర్వాత తిరిగి మున్సిపల్‌చైర్‌పర్సన్‌ స్వప్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని 1/3 వంతు మెజార్టీతో బడ్జెట్‌ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత తిరిగి నిబంధనల మేరకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయరాదని మూడు రోజుల వ్యవధి ఉండాలని, ఈ బడ్జెట్‌ ఆమోదం చెల్లదని అదనపు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ విషయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న హై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటీషన్‌దారున్ని పిలిపించి 15రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. దీనిపై ఇప్పటి వరకు కూడా మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకోలేదు. జనరల్‌ ఫండ్‌ నిధుల నుంచి కేవలం సిబ్బంది, కార్మికుల వేతనాల కోసమే నిధులు వినియోగిస్తున్నారు.  తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి చెత్త సేకరణ కోసం ఉన్న ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కూడా మూలనబడ్డాయి. వాటిని మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా మున్సిపాలిటీల్లో విద్యుత్‌ లైట్ల కొనుగోళ్లు, ఏర్పాట్లు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి నిధులు వాడుకోలేని పరిస్థితి కారణంగా అధికారులు కూడా పనులు చేపట్టలేక చేతులెత్తేశారు. అత్యవసరంగా తాగునీటి మరమ్మతుల పనులు కూడా చేయడం లేదు. గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా నిధులు ఉండి బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కోర్టు క్లియరెన్స్‌ చేసేందుకు కూడా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లకు సుమారు రూ.2 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. 

ఉన్నతాధికారులే పెండింగ్‌లో పెట్టారు:  స్వప్న, చైర్‌పర్సన్‌, తాండూరు మున్సిపాలిటీ

తాండూరు మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం కోరం ద్వారానే నా అధ్యక్షతన ఆమోదం తెలిపాం. ఆమోదించిన బడ్జెట్‌ను చెల్లదని అధికారులు పేర్కొంటుండగా, ఈ అంశంపై కోర్టును ఆశ్రయించగా, ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టు కూడా మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి సీడీఎంఏకు ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదు. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది:  అశోక్‌కుమార్‌, ఇన్‌చార్జి మునిసిపల్‌ కమిషనర్‌, తాండూరు.

బడ్జెట్‌ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినందున ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం  తీసుకోలేదు.   కోర్టు  ఈ సమస్యను పరిష్కరించాలని  మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినందున దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అయితే కోర్టులో కేసు వేసిన పిటీషన్‌దారుని, మున్సిపల్‌ అధికారుల వాదనలు విన్న తర్వాత ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మాకు రిటర్న్‌గా ఎలాంటి నోటీసు, ఆదేశాలు రాలేదు.

Updated Date - 2022-10-18T04:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising