ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-05-17T05:35:20+05:30

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న గీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌రూరల్‌, మే 16: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారిణి గీతారెడ్డి హెచ్చరించారు. ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట రైతు వేదికలో సోమవారం షాద్‌నగర్‌ డివిజన్‌లోని ఫర్టిలైజర్‌ దుకాణదారులు, డీలర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు లాభాలు గడించే విధంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా, అంతర్‌ జిల్లా, ఎస్‌వోటీ, సివిల్‌ పోలీసులతో ప్రభుత్వం టీమ్‌లను ఏర్పాటు చేసిందని, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.  ఏసీపీ కుషాల్కర్‌ మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు నష్టం చేయొద్దన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. షాద్‌నగర్‌ డివిజన్‌లో గతంలో ఐదుగురిపై పీడీ యాక్టు పెట్టినట్లు వివరించారు. సమావేశంలో ఏడీఏ రాజారత్నం, సర్పంచ్‌ సాయిప్రసాద్‌ యాదవ్‌, ఎంపీటీసీ శ్రీశైలం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising