ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరామలింగ్వేర కళాశాల ఎత్తివేతను విరమించుకోవాలి

ABN, First Publish Date - 2022-07-01T06:36:12+05:30

శ్రీరామలింగ్వేర కళాశాల ఎత్తివేతను విరమించుకోవాలి

కులకచర్ల రామలింగేశ్వర కళాశాల ముందు అధ్యాపకులకు మద్దతుగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • భవనంపైకి ఎక్కి అధ్యాపకుల ఆందోళన
  • డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి హామీతో ఆందోళన విరమణ

కులకచర్ల, జూన్‌ 30 : మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర కళాశాల ఎత్తివేతను విరమించుకోవాలని కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు గురువారం కళాశాల భవనంపైకి ఎక్కి ఆందోళన చేశారు. కళాశాల ఎత్తివేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని, కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటమే శరణ్యమని వాపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు అక్కడికి చేరుకొని అధ్యాపకులకు మద్దతుగా కళాశాల ఎదుట బైటాయించి ధర్నా చేపట్టారు. కళాశాలలో ఇంటర్‌, డిగ్రీని కోర్సులను ఎత్తివేస్తే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని డీసీసీబీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ గిరి అక్కడికి చేరుకొని అధ్యాపకులతో మాట్లాడి నచ్చచెప్పారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి అధ్యాపకులతో ఫోన్‌లో మాట్లాడారు. తాను మంత్రితో మాట్లాడి కళాశాల ఎత్తి వేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అధ్యాపకులు ఆందోళన విరమించారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ధర్నా విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య, గోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్‌ ఆంజనేయులు, గోపాల్‌నాయక్‌, ఎంపీటీసీ ఆనందం, పీఎన్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising