ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-19T05:42:34+05:30

పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

షాబాద్‌: కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌/ఆమనగల్లు/ కడ్తాల్‌, ఆగస్టు 18: షాబాద్‌ల విశ్వహిందూ పరిషత్‌  ఆధ్వర్యంలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపారు. చిన్నారులు శ్రీకృష్ణులు, గోపికల వేషధారణలతో, పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా 100మీటర్ల జాతీయ పతాకంతో షాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, భజ్‌రంగ్‌దళ్‌ విభాగ్‌ కోకన్వీనర్‌ గూడెం రమేష్‌ , విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ పాల్గొన్నారు.  అదేవిధంగా ఆమనగల్లులోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపారు. పాఠశాల ఆవరణలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని  జరిపారు. ఆమనగల్లు మార్కెట్‌చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, పాఠశాల డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ విఠల్‌, పాల్గొన్నారు. కాగా, జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కడ్తాల మండలం బాలాజీనగర్‌ తండా సమీపంలోని ధనరాశి పర్వతంపై గల శ్రీ రాధాకృష్ణ దేవాలయం కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబైంది. శుక్రవారం నుంచి నిర్వహించే వేడుకల కోసం రాధాకృష్ణ మందిరాన్ని శోభాయామానంగా అలంకరించారు. మూడు రోజుల పాటు కొనసాగే వేడుకలకు ఆలయ నిర్వాహకుడు రామావత్‌ బీచ్యానాయక్‌ ఆధ్వర్యంలో వేడుకలకు హజరయ్యే భక్తుల కోసం విశాల వసతులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-19T05:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising