ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2022-08-12T05:30:00+05:30

పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

యాచారం: నందివనపర్తి శ్రీపెద్దమ్మ ఆలయంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిని సన్మానించిన ఆలయ నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం,  ఆగస్టు 12:  యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శ్రీపెద్దమ్మ తల్లికి  శుక్రవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కాగా తహసీల్దారు సుచరిత, డిప్యూటీ తహసీల్దారు వినోద్‌కుమార్‌లతో పాటు కార్యాలయ సిబ్బందిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలందించారు. ఆలయంలో తహసీల్దారు సుచరిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామికి మకర తోరణం

షాద్‌నగర్‌అర్బన్‌, ఆగస్టు 12: మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి విగ్రహానికి స్థానిక సీనియర్‌ బీజేపీ నాయకుడు అందె బాబయ్య కుమారుడు అందె రాజు ఇత్తడితో తయారు చేయించిన మకర తోరణాన్ని అలంకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ పి. శ్రీశైలంగౌడ్‌ సమక్షంలో శుక్రవారం స్వామికి మకర తోరణాన్ని రాజు సమర్పించి పూజలు చేశారు.  

గాయత్రి మాలాధారణ

శంషాబాద్‌, ఆగస్టు 12: మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గాయత్రి మాలాధారణ జరిగింది. కార్యక్రమంలో వర్కల శ్రీరాలు, పావణివెంకటేశ్‌, వి.బాల్‌రాజ్‌, కృష్ణ, పావని, రమేష్‌, రవి, మహేష్‌ కుమార్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising