ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా మైదానాలకు స్థల పరిశీలన

ABN, First Publish Date - 2022-05-25T05:22:25+05:30

క్రీడా మైదానాలకు స్థల పరిశీలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 24 : గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం స్థలాల పరిశీలన చేస్తున్నట్లు ఎంపీడీవో అరుణారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కాచవానిసింగారం, మహేశ్వరీనగర్‌లో మంగళవారం ఆమె క్రీడా మైదానాల కొరకు స్థల సేకరణ చేపట్టారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖో-ఖో, షటిల్‌ వంటి ఆటల కోసం ప్రతి గ్రామంలో మైదానాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, వార్డుసభ్యుడు మట్ట విష్ణుగౌడ్‌, పంచాయతీ సిబ్బంది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising