ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తికోసం అక్క హత్యకు చెల్లెలి కుట్ర

ABN, First Publish Date - 2022-01-28T05:20:52+05:30

ఆస్తికోసం అక్క హత్యకు చెల్లెలి కుట్ర

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సుపారీ కుట్ర వివరాలు వెల్లడించిన షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమారర్‌

షాబాద్‌, జనవరి 27: స్థిరాస్తి పంపకం తగాదాలతో సొంత అక్కను చెల్లెలు చంపేందుకు కిరాయి హంతకులను పంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యాయత్యం వివరాలను వెల్లడించారు. తాటికొండ పుష్పమణి, సింధూర అక్కాచెల్లెల్లు. వీరికి విజయవాడలో 20గుంటల భూమి ఉంది. ఈ భూమి పంపకం లావాదేవీల్లో వారి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. భూ తగాదాల కారణంగా అక్కపై సింధూర పగ పెంచుకుంది. తన భర్త శ్రీనాథ్‌తో కలిసి అక్కను చంపేందుకు పథకం పన్నారు. హైదరాబాద్‌లోని బండి శ్రీకాంత్‌గౌడ్‌ను కలిసి పుష్పమణిని చంపేందుకు ఒప్పం దంకుదుర్చుకున్నారు. అందుకు శ్రీకాంత్‌గౌడ్‌కు రూ.2లక్షల సుపారీ సైతం ఇచ్చారు. శ్రీకాంత్‌గౌడ్‌ హైదరాబాద్‌లో దినసరి కూలీలైన భానుకిరణ్‌, సాయికిరణ్‌, వినోద్‌కుమార్‌, బ్రహ్మచారి, సాయికుమార్‌తో మాట్లాడి హత్య చేసేందుకు ఒప్పించాడు. పుష్పమణి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటూ పూడూర్‌ మండలం మిట్టకంకల్‌ వద్ద వ్యవసాయ భూమిని కొనుగోళు చేసి అక్కడ ఫాంహౌస్‌ నిర్మిస్తోంది. ఫాంహౌస్‌ నిర్మాణంలో భాగంగా తరచూ అక్కడికి పుష్పమణి వస్తూ ఉండేది. ఇదే అవకాశంగా భావించిన వీరు ఈ నెల 24న ఐదుగురు కలిసి కారులో ఫాంహౌజ్‌ సమీపంలోగల రేగడిదోస్వాడలో వేచి చూశారు. సాయంత్రం 4గంటల సమయంలో స్నేహితుడు రాజ్‌కుమార్‌తో కలిసి పుష్పమణి ఐ20 కారులో ఫాంహౌస్‌ వెళ్లి తిరిగి నగరానికి బయల్దేరారు. అదే సమయంలో కాచుకు చూస్తున్న దుండగులు వారిపై దాడికి యత్నించారు. కారులో డోర్‌ లాక్‌ చేసుకోవడంతో దుండగులు ఎంత ప్రయత్నించినా డోర్‌ తెరుచుకోకపోవడ ంతో అద్దాలు పగులగొట్టి పుష్పమణిని చంపేందుకు యత్నించగా రాజే్‌షకుమారర్‌ కారును రివర్స్‌ తీసుకొని వారిని తప్పించుకొని కారులో వెళ్లి షాబాద్‌ పోలీసులకు ఆశ్రయించారు. పుష్పమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. హత్యాయత్నంలో 8మంది పాల్గొనగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు.

Updated Date - 2022-01-28T05:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising