సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ ధర్నాను జయప్రదం చేయాలి
ABN, First Publish Date - 2022-10-08T05:21:57+05:30
సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ ధర్నాను జయప్రదం చేయాలి
ఘట్‌కేసర్ రూరల్, అక్టోబరు 7 : సింగరేణి పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న గోదావరిఖని కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి రిటైర్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆళవందార్ వేణు మాధవ్ అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొర్రెముల్ సుప్రభాత్ టౌన్‌షిప్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఐదు సంవత్సరాలకోసారి సమీక్ష జరిపి పెన్షన్ పెంచాలని నింబంధనలు ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాల తీరుపై వందమంది ఎంపీలకు, పలువురు కేంద్ర మంత్రులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రికి, చివరకు ప్రధాన మంత్రికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కనిపించడం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీరయ్య, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, దైవాధీనం, రజనర్సు, రఫీక్, నర్సయ్య, మీరా ప్రసాద్, మల్లయ్య, బాల్‌రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T05:21:57+05:30 IST