సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN, First Publish Date - 2022-08-04T05:47:09+05:30
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
తాండూరు రూరల్, ఆగస్టు 3 : గ్రామాల్లో ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని కరన్‌కోట్ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు మండలం గోపన్‌పల్లి గ్రామ శివారులో గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫోన్‌లో ఎవరైనా ఏటీఎం కార్డుకు సంబంధించిన వివరాలు అడిగితే చెప్పరాదని, సైబర్ నేరస్థులు తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ఏటీఎం కార్డు పనిచేయడం లేదని, బ్లాక్ అయిందని వెంటనే మీ ఖాతాకు సంబంధించిన వివరాలు, పిన్ నెంబర్ చెప్పాలని అడిగితే ఇవ్వరాదని ఆయన సూచించారు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2022-08-04T05:47:09+05:30 IST