కులకచర్లలో డీజిల్ కొరత!
ABN, First Publish Date - 2022-08-04T05:51:05+05:30
కులకచర్లలో డీజిల్ కొరత!
కులకచర్ల, ఆగస్టు 3: కులకచర్లలో డీజిల్ కొరత ఏర్పడింది. స్థానికంగా 3 పెట్రోలు బంక్‌లు ఉండగా.. బుధవారం ఒకే బంక్‌లో డీజిల్ స్టాక్ ఉండటంతో వాహనదారులు, రైతులు బారులు తీరారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలతో పనులు చేపడుతున్నారు. దీంతో డీజిల్ ఎక్కువ మొత్తంలో అవసరం. కాగా, బంక్‌ల యజమానులే డీజిల్ కొరత సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా వాహనదారులు, రైతులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2022-08-04T05:51:05+05:30 IST