వివాహితపైౖ లైంగిక దాడి
ABN, First Publish Date - 2022-10-17T05:30:00+05:30
వివాహితపైౖ లైంగిక దాడి
బషీరాబాద్, అక్టోబరు 17: ఓ వివాహితపై వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కంసాన్‌పల్లి(ఎం) శివారులో చోటుచేసుకోగా సోమవారం బాధితురాలి ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కంసాన్‌పల్లికి చెందిన మహిళ(40) తన కుమారుడితో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఊరి శివారులో పొలం వద్ద మేకను మేపుకుంటుండగా ఆదే గ్రామానికి చెందిన సాకలి ముకుంద్ వచ్చి మహిళను పొలంలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి కుమారుడు వెంటనే తన వద్ద ఫోన్‌తో శంకర్‌పల్లిలో ఉన్న తండ్రికి ఫోన్ చేశాడు. భర్త సూచన మేరకు ఇంటికి వెళ్లిన మహిళ సోమవారం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి లైంగికదాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST